ప్రచారం చేస్తున్న రఘునాథ్
ప్రజాశక్తి -అరకులోయ రూరల్: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 6న లోక్ అదాలత్ శిబిరం నిర్వహిస్తున్నట్లు జాతీయ వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు సమర్డి రఘునాథ్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మండలంలోని పెదలబుడు పంచాయతీ సికోలనీ, కంటబౌసుగుడ, శరభగుడ, జెడ్పి కోలనీ గ్రామాల్లో సందర్శించి లోక్ అదాలత్ నిర్వహణ, ఆవశ్యకతలపై ప్రచారం నిర్వహించారు. పూర్వపు ఉన్న సివిల్ కేస్‌పై ఎవరైనా ఉంటే ఈనెల ఆరో తేదీన జరిగే లోక్ అదాలత్ శిబిరానికి రాతపూర్వకంగా వినతులను సమర్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శెట్టి సౌజన్య, శోభ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శెట్టి భగత్‌రాం, వైసిపి నాయకులు దొన్ను పాల్గొన్నారు.










