6న జిల్లా స్థాయి సదస్సు జయప్రదం చేయండి-వామపక్ష కార్మిక, రైతు సంఘాల జిల్లా నాయకులు పిలుపు
కడప అర్బన్ : వామపక్ష కార్మిక, రైతు సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈ నెల 6న సిఐటియు జిల్లా కార్యాలయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జిల్లా స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు వామ పక్ష కార్మిక రైతు సంఘాల జిల్లా కార్యదర్శులు నాగ సుబ్బారెడ్డి, మనోహర్, దస్తగిరి రెడ్డి, సుబ్బారెడ్డి, అన్వేష్ తెలిపారు. శుక్రవారం సిఐటియు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు, పేదలు, కార్మికులు, సామాన్య ప్రజల సమస్త ప్రయోజనాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకులలోని లక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్లకు ఉదారంగా అందజేస్తూ, ఈ 9 సంవత్సరాల కాలంలో దాదాపు రూ.12 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ పేరుతో రుణమాఫీ చేసిందని చెప్పారు. వ్యవసాయ సంక్షోభం ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకు పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల రుణాలు మాఫీ చేయడానికి మోడీ ప్రభుత్వానికి చేతులు రావడం లేదన్నారు. కార్పొరేట్ కంపెనీల రుణాలు మాఫీ చేయడం కాదని, రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఓడరేవులు, ఎయిర్ పోర్టులు, విద్యుత్ సంస్థలు, రైల్వే, బొగ్గు గనులు, చివరకు ఆదివాసి, గిరిజనుల అటవీ భూములపై హక్కులను హరిస్తూ తాజాగా అటవీ చట్టానికి సవరణసమావేశంలో మాట్లాడతున్న నాగసుబ్బారెడ్డి పాస్ చేసిందని విమర్శించారు. ఈ చర్యలన్నీ కార్పొరేట్లకు ప్రత్యేకంగా మోడీ ి మానస పుత్రుడు గౌతమ్ అదానీని ప్రపంచ కుబేరులలో మొదటి స్థానానికి చేర్చేందుకు దోహదపడ్డాయన్నారు. సామాన్య ప్రజలపైన పన్నుల భారాన్ని పెంచుతూ, కార్పొరేట్లకు ఐటి, ఎక్సైజ్, కస్టమ్స్, కార్పొరేట్ టాక్స్ ల పైన లక్షలాది కోట్ల రూపాయల రాయితీలను ఇసుందని అన్నారు. మరోవైపు కార్మికుల హక్కులను హరిస్తూ నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకువచ్చిందన్నారు. ఫలితంగా బలహీన వర్గాల ప్రజల ఉపాధికి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు లాభాలు పెంచి ప్రజల సంపదలు లూటీ చేస్తున్న కార్పొరేట్లను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈనెల 26, 27 తేదీల్లో విజయ వాడలో జరిగే రాష్ట్రస్థాయి మహాధర్నాను జయప్రదం కోసం జిల్లాస్థాయి సన్నా హక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో సిఐట ియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోపాల కష్ణయ్య, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య, ఎఐటియుసి నగర అధ్యక్షులు మద్దిలేటి, సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ పాల్గొన్నారు.