6న చలో విజయవాడను జయప్రదం చేయండి: సిఐటియు
ప్రజాశక్తి - గూడూరు టౌన్: ఆటోవర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అక్టోబరు 6వ తేదీ నిర్వహించనున్న చలో విజయవాడను జయప్రదం చేయాలని కోరుతూ తిరుపతి జిల్లా సిఐటియు ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు బివి రమణయ్య పిలుపు నిచ్చారు. సిఐటియు ఆటో డ్రైవర్స్ యూనియన్, కోట, విద్యానగర్, టాటా మ్యాజిక్ ఆటో డ్రైవర్స్ జనరల్ బాడీ సమావేశం గూడూరు సిఐటియు కార్యాల యంలో శుక్రవారం ఆ యూనియన్ పట్టణ అధ్యక్షులు పి. లక్ష్మయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గూడురు శాఖ కార్యదర్శి జోగి శివకుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో సిఐటియు తిరుపతి జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి.వి.రమణయ్య మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫారం వేసుకొని బండికి సంబంధించిన కాగితాలు అన్నీ సరిగా ఉంచుకొని, తమ కుటుంబాన్ని తలుచుకొని, ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా డ్రైవింగ్ చేయాలని ప్రయాణికుల పట్ల సత్ప్రవర్తన, మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు. ఆటో కార్మికులు దీర్ఘకాలికంగా ఉన్న పలు సమస్యలు పరిష్కారం కై ''ఆల్ ఇండియా రోడ్ ట్రాన్సుపోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్' ఇచ్చిన పిలుపుమేరకు (ఎఐఆర్‌ట డబ్ల్యుఎఫ్) అక్టోబర్ ఆరవ తేదీ నిర్వహించనున్న చలో విజయవాడను జయప్రదం చేయాలని కార్మిక రవాణా రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు సాధనకై జీవో నెంబర్ 21న రద్దు చేయాలని, గ్రీన్ టాక్స్ రద్దు చేయాలని పెంచిన త్రైమాసిక రహదారి పన్నులను రద్దు చేయాలని, వాహనాలు నిలుపుకునేందుకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలని కోరారు. ఆటోలు, ట్రక్కులు, ఇతర వాహనాలు కొనుగోలుకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని డ్రైవర్లకు షెడ్లు ఎంప్లాయి మెంట్, జీవో సవరించాలని, పెంచిన పెట్రోల్, డీజిల్, పెనాల్టీలు తగ్గించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టనున్న చలో విజయవాడ ను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం నూతన కమిటీ ఎన్నిక ఏర్పాటు చేశారు. అధ్యక్షులుగా శ్రీపతి పాల్, ఉపాధ్యక్షులుగా చనుమూరు సుధాకర్, కార్యదర్శిగా తురక వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శిగా ఏ.మురళి, ట్రెజరర్ మల్లి.గురవయ్య ను, కమిటీ సభ్యులుగా టీ.శ్రీనివాసులు రెడ్డి బల్లి పవన్, ఇ .మణి, ఎం.మహేష్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శి బి. రమేష్, బి.చంద్రయ్య పాల్గొన్నారు.










