ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఛలో విజయ వాడ ధర్నాకార్యక్రమంలో ఆటో, మోటార్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మారుబోయిన రాజా పిలుపునిచ్చారు. తోటపల్లిగూడూరు మండలం నరుకూరులో అయన మాట్లాడుతూ ఆటో, మోటార్ కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ ఈ నెల 6వ తేదీన ఛలో విజయవాడ ధర్నా చౌక్ లో మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు రాజా తెలిపారు. ఈ మహా ధర్నాలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రాజా సూచించారు. ఆలిండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ టఏఐఆర్తి డబ్ల్యూఎఫ్‌ఊ జిల్లా బాధ్యులు కె సురేష్, జిల్లా కమిటీ సభ్యులు ఎం. సుధాకర్, రాధయ్య, పరుశురామయ్య, వెంకట శేషయ్య, గోపి, శివ, మరియు సిఐటియు నాయకులు వేగూరు వెంకయ్య పాల్గొన్నారు.










