Nov 01,2023 23:35

రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్‌ పావని

ప్రజాశక్తి- బూర్జ: మండలంలో డొంకపర్త సచివాలయంలో బూర్జ పిహెచ్‌సి ఆధ్వర్యంలో 67 మందికి డాక్టర్‌ పావని వైద్యసేవలు అందించారు. గర్భిణీలకు బిపి, షుగర్‌, దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం వస్తున్న శీతాకాలంలో ప్రతిఒక్కరు జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఉదయం, సాయంత్రం చలి గాలిలో తిరగరాదన్నారు. కార్యక్రమంలో ఎఎన్‌ఎం లక్ష్మి, ఎంఎల్‌హెచ్‌పిఒ రాధిక, డిఇఒ వెంకటరమణ, పైలట్‌ అసిరి నాయుడు, ఆశా వర్కర్ల రాణి రూపవతి పాల్గొన్నారు.