
ఆందోళన చేస్తున్నమత్స్యకారులు
ప్రజాశక్తి -నక్కపల్లి :హెటిరో డ్రగ్స్ కంపెనీ పైప్లైన్ కి వ్యతిరేకంగా మత్స్యకారులు తలపెట్టిన శాంతి యుత మహాధర్నా 633 వ రోజుకు చేరింది. శుక్రవారం ఆందోళన శిబిరం వద్ద సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అప్పలరాజు మత్స్యకారులతో కలిసి పైప్ లైన్ కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మత్స్యకారుల జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులకు న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎం.రాజేష్, మత్య్సకారుల నాయకులు జీ.సోమేశ్వరావు, సి.హెచ్.సోమేష్, పి.కోటి, జీ.కాశీ, వి.అప్పారావు, బి.నూకరాజు, ఎం.బాబ్జీ, వి.దేవుడు, ఆదిరాజు పాల్గొన్నారు.