Jul 18,2022 00:06

సభ్యత్వ నమోదులో పాల్గొన్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి- ములగాడ : జివిఎంసి 61వ వార్డు పరిధి బూత్‌ నెంబర్‌ 140 మల్కాపురం గొల్లవీధిలో తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షుడు మజ్జి సోమేష్‌, బూత్‌ కన్వీనర్‌ ఉరుకూటి మురళీధర్‌ నేతృత్వంలో ఆదివారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 50 మంది సభ్యత్వాలను నమోదు చేసుకున్నారు. అనంతరం వార్డు అధ్యక్షులు సోమేష్‌, మహిళా అధ్యక్షులు సర్వసిద్ధి శ్రీలక్ష్మి మాట్లాడుతూ, టిడిపి బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వ పాలన పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా ఉందని ఆరోపించారు. ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలే ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చింతలపూడి సత్యనారాయణ, సర్వసిద్ధి శ్రీనివాసరావు, ఉరుకూటి పైడిరాజు, జయశంకర్‌, పాసి చిన్న, నూనె శ్రీనివాసరావు పాల్గొన్నారు.