ప్రజాశక్తి -ములగాడ : జివిఎంసి 61వ వార్డు పరిధి పల్లివీధి సచివాలయం ప్రాంతంలో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త ఆనంద్ కుమార్, వార్డు కార్పొరేటర్ కొణతాల సుధాజగన్మోహన్రావు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజల సమస్యలనడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారం కోసం సంబంధిత సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు పీవీ.సురేష్, 62వ వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు, ట్రేడ్ యూనియన్ నాయకులు బోగవెల్లి నాగభూషణం, 63వ వార్డు వైసిపి ఇన్ఛార్జి పిలకా రామ్మోహన్రెడ్డి, చంటి నూకరాజు, బూసా అప్పలరెడ్డి, కర్రి బాలు, కొల్లి నూకరెడ్డి, విజరు, స్వప్న, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










