ప్రజాశక్తి-గుంటూరు, నరసరావుపేట : పేదరికాన్ని జయించాలంటే విద్య ద్వారానే సాధ్యం అని గుంటూరు పల్నాడు జిల్లా కలెక్టర్లు ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఎల్.శివశంకర్ అన్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా, కొవ్వూరు నుంచి సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న విద్యాదీవెన రెండో విడత నిధులు జమను ప్రారంభించగా గుంటూరులో కలెక్టరేట్ నుండి కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, నరసరావుపేటలో కలెక్టరేట్ నుండి కలెక్టర్ ఎల్.శివశంకర్, డిఆర్‌ఒ వినాయకం, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఓబుల నాయుడు వర్చువల్‌గా పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో 28,145 మంది విద్యార్థులకు రూ.28,28,90,203 మెగా చెక్కును కలెక్టర్, ప్రజా ప్రతినిధులు అందించా రు. పల్నాడు జిల్లాకు సంబంధించి 31,963 మందికి రూ 32.35 కోట్ల మెగా చెక్కును అందించారు. అనంతరం కలెక్టర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకూ పేదలకు ఉచితంగా అందించేందుకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. విద్య కోసం పేదలకు ఆర్ధిక ఇబ్బందులు ఉండకూడదని జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందిస్తున్నారన్నారు. ఈ మొత్తాలను విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని బాగా చదవాలని, ఉన్నత స్థానాలు అధిగమించి, వారి కుటుంబం, సమాజ అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. కార్యక్రమంలో గుంటూరు కలెక్టరేట్ నుండి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎం.శేషగిరిరావు, రాష్ట్ర శాలివాహన, కుమ్మరి కార్పొరేషన్ చైర్మన్ మండేపూడి పురుషోత్తం, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, సహాయ కార్పొరేషన్ చైర్‌పర్సన్ ముంతాజ్ పఠాన్, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరక్టర్ మధుసూదనరావు, బీసీ సంక్షేమ శాఖాధికారి నర్సారెడ్డి, ఎన్‌ఆర్‌ఈడీసీ డైరక్టర్ కొత్త చిన్నపరెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరక్టర్ అబూదా షరీఫ్ పాల్గొన్నారు.
గుంటూరులో మెగా చెక్కు అందిస్తున్న కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు










