Sep 28,2023 00:27

600 ఓటర్లకు మించి ఉంటే ప్రత్యేక కేంద్రం

600 ఓటర్లకు మించి ఉంటే ప్రత్యేక కేంద్రం
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్‌
వారం రోజులుగా 3,796 దరఖాస్తులు ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులకు రావడం జరిగిందని, అక్టోబర్‌ 17న పోలింగ్‌ కేంద్రాల జాబితా, అక్టోబర్‌ 27న డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌ ఉంటుందని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌. రాజశేఖర్‌ తెలిపారు. బుధవారం డిఆర్‌ఓ ఛాంబర్‌ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఆర్‌ ఓ మాట్లాడుతూ వారం రోజులుగా జిల్లాలో ఓటర్ల జాబితా మార్పులు చేర్పులకు సంబంధించి ఫామ్‌ 6 కు సంబంధించి 1715, ఫామ్‌ 7 కు సంబంధించి 790, ఫామ్‌ 8కి సంబంధించి 1291 దరఖాస్తులు వచ్చాయన్నారు. . ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు అక్టోబర్‌ 27న డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌ ఉంటుందని తెలిపారు. పట్టణ ప్రాంతాలలో ఒకే ప్రదేశంలో 600 మందికి పైగా ఓటర్లు ఉన్నట్లయితే ప్రత్యేక పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సిపిఎం తరఫున గంగరాజు, సిపిఐ నుంచి నాగరాజన్‌, కాంగ్రెస్‌ నుంచి పరదేశి, వైఎస్‌ఆర్సిపి నుంచి ఉదరు కుమార్‌, టిడిపి నుంచి సురేంద్ర కుమార్‌ ప్రతినిధులుగా హాజరయ్యారు.