Sep 04,2022 23:22

రోగులకు అవగాహన కల్పిస్తున్న వైద్యలు

ప్రజాశక్తి- మధురవాడ : జివిఎంసి 5వ వార్డు పరిధిలో మారికవలసలో స్టార్‌ పినాకిల్‌ హెచ్‌సిజి ఆధ్వర్యాన ఉచిత కేన్సర్‌ వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్‌ బోర మురళీధర్‌ పరవేక్షణలో పలువురు రోగులకు తనిఖీలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణి చేశారు. మాజీ కార్పొరేటర్‌ పోతిన హనుమంతురావు ఆధ్వర్యాన నిర్వహించిన శిబిరంలో కేన్సర్‌పై అవగాహన కల్పించారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న చిన్నపిల్లలకు స్టార్‌ పినాకిల్‌ హెచ్‌సిజి ఆధ్వర్యాన ఉచితంగా వైద్యం చేస్తామని డాక్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు వైసిపి ఇన్‌ఛార్జి పోతిన సురేష్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీ సభ్యులు జెఎస్‌.రెడ్డి, వార్డు ప్రచార కార్యదర్శి రిషికేశ్‌, శంకరరావు, దాసరి కృష్ణ, నరసింగరావు, మోహనరావు, చేకూరి రజిని, గాయత్రీ, అప్పయ్యమ్మ పాల్గొన్నారు.