ప్రజాశక్తి -నెల్లూరు :నెల్లూరు రూరల్ మండలంలోని నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో ఈనెల 5వ తేదీ వరకు జరగనున్నబ్రహ్మోత్సవాలకు రావాలని నెల్లూరు విజయ డెయిరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డిని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ఛైర్మన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, దేవస్థాన కార్య నిర్వహణ అధికారి వి గిరికష్ణ ఆదివారం నెల్లూరు ఎంపి కార్యాలయంలో ఆహ్వాన పత్రిక అందించి ఆహ్వానం పలికారు. దేవస్థానం అభివద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఆయన ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. 3వ తేదీ సాయంత్రం మహా శాంతి హోమం, మహా శాంతి అభిషేకం వంటి ప్రత్యేక విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 4వ తేదీ ఉదయం యాగశాలలో విశేష హోమాలు, కుంభారాధన, మహా పూర్ణ ఆహుతి, మహా సంప్రోక్షణ, కుంభాభిషేకం, తీర్థ ప్రసాద వియోగం, మహాదాశీర్వాదం వంటి విశేష కార్యక్రమాలు, అంకురార్పణ ఉత్సవం వంటి ప్రత్యేక విశేష కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. 5వ తేదీ ఉదయం 5 గంటలకు ధ్వజారోహణకు సంబంధించి యాగశాల కార్యక్రమాలు, అదే రోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10:00 వరకు తప్పర ఉత్సవం గిరి ప్రదర్శన ధ్వజరోహణ, శేషవాహన సేవ హంసవాహన సేవ, సింహవాహన సేవ, హనుమంత సేవ, గరుడుసేవ, కళ్యాణోత్సవం, గజవాహన సేవ, రథోత్సవం, చక్రస్నానం, చప్పర ఉత్సవం, గిరిప్రదర్శన, బలిహరణ, ద్వజవరోహణ, పూర్ణఆహుతి, కుంభవాహన, ఏకాంతసేవ, వంటి ప్రత్యేక ఉత్సవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. దేవస్థానంలో జరుగుతున్న నిత్య అన్నదాన పథకానికి విరాళాలు ఇవ్వాలని దేవస్థాన చైర్మన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి కోరారు. నెల్లూరు రూరల్ మండలంలోని ప్రజలు, జిల్లాలోని స్వామివారి భక్తులు ఈ ప్రత్యేక ఉత్సవాలలో పాల్గొని తీర్థప్రసాదులు పొంది స్వామి వారి కపకు పాత్రులు కావాలని కోరారు.










