Mar 26,2023 00:21

ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతున్న సిఐటియు నేత రాము

ప్రజాశక్తి- కె.కోటపాడు
ఏప్రిల్‌ ఐదో తేదీన జరుగు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. శనివారము స్థానిక సిఐటియు కార్యాలయంలో చలో ఢిల్లీ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, అన్నివర్గాల సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. కార్మికులకు కనీస వేతనం రూ.26000 అమలు చేయాలని, కనీస పెన్షన్‌ రూ.10000 ఇవ్వాలని, నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, సిపిఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంల ప్రజాసంఘాల మండల నాయకులు ఎర్ర దేవుడు, రైతు సంఘం నాయకులు వనము సూర్యనారాయణ, గండి నాయనిబాబు రైతులు పాల్గొన్నారు.
అచ్యుతాపురం : కార్మిక, రైతు, ఉపాధి కూలీల సమస్యలు పరిష్కారానికి ఏప్రిల్‌ 5 చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌ రాము పిలుపునిచ్చారు. మండలంలోని పెదపాడు, తిమ్మరాజుపేట గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించి ఉపాధి కూలీలతో సమయసమయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు వరాలమ్మ, మంగమ్మ, సోములు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.