ప్రజాశక్తి -అరకులోయ రూరల్:కేంద్రంలో బిజెపి పాలనలో దేశంలోని పేదరికం, నిరుద్యోగం తీవ్రస్థాయిలో పెరుగుతుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు తెలిపారు.ఆదివారం అరకువేలి మండలం సుంకరమెట్ట వారపు సంతలో కరపత్రాలు పంచుతూ విస్తత ప్రచారం నిర్వహించారు. అనంతరం మాట్లాడారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 5న చలో ఢిల్లీ లక్షల మందితో జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా సిఐటియు, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందని తెలిపారు.కార్మికులకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రటిష్టంగా అమలు చేయాలన్నారు.పండించిన ప్రతీ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు.గిరిజన ప్రాంతంలో హైడ్రోక్ పవర్ ప్రాజెక్ట్ రద్దు చేయాలని అన్నారు.జీవో 3కు చట్టబద్ధత కల్పించి ఉద్యోగావ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆటో మోటార్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని తెలిపారు.భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. కాఫీ రైతుల బకాయిలు ఐటీడీఏ తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. గిరిజన హక్కులు, చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. స్కీం వర్కర్లకుఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులందరికీ రెగ్యులర్ చేయాలని తెలిపారు. దేశంలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ తదితర డిమాండ్లపై ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు, జిసిసి కార్మికులు సింహాద్రి, జోషి, కృష్ణ, కాఫీ రైతు సంఘం నాయకులు పాంగి నానిబాబు, ఏపీ గిరిజన సంఘం మండల కార్యదర్శి పాంగి రామన్న, గిరిజన సంఘం నాయకులు టి జోషి పాల్గొన్నారు.










