
ప్రజాశక్తి -యంత్రాంగం
స్టీల్‌ప్లాంట్ ఆర్చి వద్ద ఈ నెల 5వ తేదీన జరిగే ఉక్కు రక్షణ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన శనివారం సమావేశాలు, పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.
గాజువాక : విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు ఈ నెల 5వ తేదీన నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం గాజువాక జోన్ కార్యదర్శి ఎం.రాంబాబు పిలుపునిచ్చారు. జోన్ - 6 పరిధి 75, 76వ వార్డు పారిశుధ్య కార్మికుల జనరల్ బాడీ సమావేశం పెదగంట్యాడ మండలం నడుపూర్ మస్టర్ పాయింట్ల వద్ద శనివారం జివిఎంసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రాంబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో గొలగాని అప్పారావు, గొల్ల రాము, నక్క నాగరాజు, సావిత్రి, సూరిబాబు, లక్ష్మి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ప్లాంట్ వ్యూహాత్మక అమ్మకానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చడంలో భాగంగా అక్టోబర్ 5న బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు యు.రామస్వామి తెలిపారు. స్టీల్‌ప్లాంట్ స్టోర్ జంక్షన్ వద్ద బహిరంగ సభకు సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ, ప్రజా ఉద్యమాలు ఉధృతమైతే పాలకుల నిర్ణయాలపై ప్రభావం చూపుతాయన్నారు. ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటి.దాస్, సిఐటియు నాయకులు ఎన్.రామారావు, కూన వెంకట్రావు, పి.శ్రీనివాసరాజు, గంగాధర్, వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి, మొహిద్దిన్, దుర్గాప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి, డిఎస్‌విఎస్.శ్రీనివాస్, శంకరరావు, గోపాలకృష్ణంరాజు, భానుమూర్తి, మధుసూదన్, విడివి.పూర్ణచంద్రరావు, దేముడునాయుడు, వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, కార్మికులు పాల్గొన్నారు.
విశాఖ కలెక్టరేట్ : ఈ నెల 5న స్టీల్‌ప్లాంట్ ఆర్చి వద్ద జరిగే ఉక్కు రక్షణ బహిరంగ సభ పోస్టర్‌ను సింగ్ హోటల్ జంక్షన్ వద్ద భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. నాయకులు కె.నర్సింగరావు మాట్లాడారు. కార్యక్రమంలో పోలయ్య, సింగనాయుడు, ఈశ్వరరావు, సిఐటియు జగదాంబ జోన్ కార్యదర్శి కెవిపి.చంద్రమౌళి, డివైఎఫ్‌ఐ నాయకులు సంతోష్ కుమార్ పాల్గొన్నారు.