Jan 04,2023 23:44

ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులతో గీతం ప్రతినిధులు

ప్రజాశక్తి- మధురవాడ : గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ప్రముఖ ఔషధ పరిశ్రమ హెటిరో డ్రగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూలలో 55మంది విద్యార్థులకు ఉద్యోగాలు సాధించారనిగీతం కెరీర్‌ గైడెన్స్‌ సెంటర్‌ డైరక్టర్‌ ఎస్‌. వంశీకిరణ్‌ తెలిపారు. గీతం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌, ఆర్గానిక్‌, ఎనలిటికల్‌ కెమెస్ట్రీ ఫైనలియర్‌ విద్యార్థులు 50మంది, అలాగే ఐదుగురు బి.ఫార్మశీ విద్యార్థులు హెటిరో సంస్థలో క్వాలిటి ఎనలిస్ట్‌, క్వాలిటీ కంట్రోలర్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు. నమూనా ఇంటర్వూలు, నిరంతర శిక్షణ గీతం విద్యార్థులు ప్రాంగణ నియామకాలలో ఎంపిక కావడానికి దోహదపడ్డాయని కెరీర్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సీనియర్‌ మేనేజర్‌ ప్రభ మహంతి తెలిపారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను గీతం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ ఎమ్‌.బాలకుమార్‌, గీతం స్కూల్‌ ఆఫ్‌ ఫార్మశీ డీన్‌ డాక్టర్‌ రామారావు, సైన్స్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.వేదవతి, రసాయన శాస్త్ర విభాగం అధిపతి ప్రొఫెసర్‌ బి. శ్రీనివాసరావు అభినందించారు.