సారాను ధ్వంసం చేస్తున్న పోలీసులు
ప్రజాశక్తి-జి.మాడుగుల: మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో పాడేరు ఏఎస్పీ దీరజ్ ఆధ్వర్యంలో 2022వ సంవత్సరంలో పట్టుబడిన 55 లీటర్ల సారాని శనివారం పెద్దల సమక్షంలో ధ్వంసం చేసినట్టు స్థానిక ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలమామిడి సర్పంచ్ రామకృష్ణ, లువాసింగి ఎంపిటిసి గబ్బాడి సన్యాసిదొర, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










