నలుగురు నిందితుల అరెస్టు
ప్రజాశక్తి-కొయ్యూరు : జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కొయ్యూరు సిఐ స్వామి నాయుడు ఆధ్వర్యంలో కొయ్యూరు ఎస్సై రాజారావు , మంప ఎస్సై లోకేష్ కుమార్, సిబ్బంది బుధవారం 55 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కొయ్యూరు ఎస్‌ఐ రాజారావు సిబ్బంది సహాయంతో సింగవరం, సురేంద్రపాలెం, కొయ్యురులో నాటు సారా అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 45 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. మంప ఎస్సై లోకేష్ కుమార్ సిబ్బంది సహాయంతో మంప పరిధిలోని బూరుగుపాలెం గ్రామంలో నాటుసారా అమ్ముతున్న ఒక మహిళను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి పది లీటర్లు నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. వారి నలుగురుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.










