ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం కింద గురువారం చొల్లంగి గ్రామ పరిధిలో కాకినాడకు చెందిన 5,380 మందికి ఇళ్ల స్థలాల అప్పగించినట్టు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం చొల్లంగి గ్రామ పరిధిలో లబ్ధిదారులకు వారి స్థలాలను అందించి, శంకుస్థాపనలు చేసే కార్యక్రమాన్ని కమిషనర్ రావిరాల మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
బీచ్‌లను శుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యతని, ప్లాస్టిక్ వాడడం తగ్గించడానికి ప్రతి ఒక్కరు కషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ రావిరాల మహేష్ పేర్కొన్నారు. మహా సముద్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఎన్టీఆర్ బీచ్‌లో నిర్వహించిన క్లీనింగ్ యాక్టివిటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చెత్తాచెదారాల నుంచి సముద్రాలను కాపాడుకోవడం ద్వారా జీవోలు అంతరించకుండా ఉంటాయన్నారు.
కాకినాడ జగన్నాధపురం లో ఉన్న ఎఫ్‌ఆర్‌యు కార్పొరేషన్ ఆసుపత్రిని కమిషనర్ సందర్శించారు. ఆసుపత్రి పనితీరు, అక్కడ ప్రజలకు అందుతున్న సేవలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగ నియామకాలు ఉంటే వాటిని తత్వాలను పూర్తి చేయాలని, ప్రజలకు తక్షణ వైద్య సౌకర్యాలు అందించేలావైద్య సౌకర్యాలు అందించేలా ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంహెచ్‌ఓ డాక్టర్ పధ్వి చరణ్ తదితరులు పాల్గొన్నారు.
నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా కాకినాడలోని అచ్చంపేట జంక్షన్ నుంచి డీప్ వాటర్ సీ పోర్ట్ వరకు 13 కిలోమీటర్ల పొడవు రహదారి నిర్మించే ప్రాజెక్టు చేపట్టిందని, ఈ తరుణంలో రహదారణ నిర్మించ ప్రాజెక్టును నిర్మాణం చేపట్టే కల్వర్టులు డ్రైనేజీ లు రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణాలు చేపట్టేలా అధికారులు అధికారులు తీసుకోవాలని కమిషనర్ ఆవిరాల మహేష్ పేర్కొన్నారు. బుధవారం రెవెన్యూ, ఇరిగేషన్, కార్పొరేషన్, ఎన్ ఎఫ్ సి ఎల్, కోరమండల్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ఖచ్చితమైన సవివరమైన నివేదికను సమర్పించాల్సిందిగా ఆయా శాఖలను కమిషనర్ కోరారు.










