Aug 10,2023 00:03

మెగాచెక్కు ను అందిస్తున్న కలెక్టర్‌, జెడ్‌పి చైర్‌పర్సన్‌

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాది తోఫా కింద పల్నాడు జిల్లాలో 526 జంటలకు రూ.4 కోట్ల 46 లక్షల 70 వేలు లబ్ధి చేకూరినట్లు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ తెలిపారు. ఈ పథకం కింద 2023 ఏప్రిల్‌ - జూన్‌ త్రైమాసికంలో వివాహం చేసుకున్న వారికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రోత్సాహాల జమను తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుండి సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పల్నాడు కలెక్టరేట్‌ నుండి కలెక్టర్‌తోపాటు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ హెనీక్రిస్టినా పాల్గొని లబ్ధిదార్లకు మెగా చెక్కును అందించారు.