Sep 13,2022 22:13

ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్న కార్పొరేటర్‌ వావిలపల్లి ప్రసాద్‌

ప్రజాశక్తి-మాధవధార : జివిఎంసి 50వ వార్డు పరిధి సాయిరాంనగర్‌, సత్యానగర్‌ సచివాలయాల పరిధిలో ఉన్న లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను వార్డు కార్పొరేటర్‌ వావిలపల్లి ప్రసాద్‌ మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సొంత ఇల్లు లేని నిరుపేదల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూసిన ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రతి పేదవాడి సొంతింటి కలను జగన్మోహన్‌రెడ్డి నెరవేర్చారన్నారు. ఈ కార్యక్రమంలో పైడి కృష్ణారావు, వేణు, సబ్బవరపు శ్రీను, శివరాం, మురళి, లోవరాజు, నూకరాజు, త్రినాధ్‌, శంకర్‌, చిరంజీవి, కనమటి రఘు, వార్డు సచివాలయ అడ్మిన్‌ కార్యదర్శి గిరీష్‌, వెల్ఫేర్‌ కార్యదర్శి మహేష్‌, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు.