
50 మంది పిఎంపీలకు పోస్టల్ బీమా
ప్రజాశక్తి - గోకవరం స్థానిక ఈశ్వర్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌లో మంగళవారం పిఎంపీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పి.చిన్ని ఆధ్వర్యంలో 50 మంది పిఎంపీలకు పోస్టల్ బీమా పాలసీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ డాక్టర్ బళ్ళ శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ మండలంలోని ప్రతి పిఎంపీకి పోస్టల్ బీమా ద్వారా భద్రత కల్పించడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఎం. నాగేశ్వరరావు, కార్యదర్శి వై.పవన్ కుమార్, ఇ.నాగేశ్వరరావు, వి.వెంకటేశ్వర్లు, సిహెచ్ వెంకటేశ్వరరావు, కె.కిరణ్ కుమార్, కె.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.