పతక విజేత ముఖేష్
ప్రజాశక్తి - గుంటూరు లీగల్ : నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆధవర్యంలో భోపాల్‌లో జరుగుతున్న కుమార్ సురేంద్రసింగ్ మెమోరియల్ నేషనల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో గుంటురుకు చెందిన నేలవల్లి ముఖేష్ 50 మీటర్ల ఫ్రీ పిస్టల్ జూనియర్ విభాగంలో రజత పతకం సాధించాడు. హర్యానాకు చెందిన షూటర్ కమల్జీత్ 600 పాయింట్లకు గాను 558 పాయింట్లు సాధించి స్వర్ణం గెలవగా, ముఖేష్ తోపాటు మధ్యప్రదేశ్‌కు చెందిన హరి ఓం ఇద్దరు 546 పాయింట్లు స్కోర్ చేశారు. వీరిద్దరిలో బుల్స్ ఐలో ఫైర్ చేసిన షాట్స్ ఎక్కువ ఉండటంతో ముఖేష్‌కు రజతం దక్కింది. హరి ఓం కాంస్య పతకం గెలిచాడు. బుధవారం జరిగిన 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ పోటీల్లో రాష్ట్రం తరఫున ముఖేష్ కాంస్య పతకం గెలిచాడు.










