50 మీటర్ల జాతీయ జెండాతో 'శ్రీ చైతన్య' విద్యార్థులు ర్యాలీ
ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్
కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా 'జయహో భారత్' ర్యాలీ కారక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు 50 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం శ్రీ చైతన్య పాఠశాలల ఎజిఎం సురేష్ మాట్లాడుతూ భారతదేశం భిన్న సంస్కృతుల కలయిక గల గొప్ప దేశమన్నారు. విద్యార్థులు మంచి దేశ పౌరులుగా ఎదగాలని, అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ రామాంజనేయులు, అకాడమిక్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ మంజుల, ఎఒ పరమేశ్వర రెడ్డి, డీన్ రాజేష్, ప్రైమరీ ఇన్‌ఛార్జి రాణి, సుజాత, రోజా, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.










