గూర్‌గావ్ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్ కొత్తగా ఎక్స్‌టర్నల్ స్టోరేజ్ డివైజ్ అయినా పోర్టబుల్ సాలిడ్ స్టేట్ డ్రైవ్ (ఎస్‌ఎస్‌డి) టి9ను విడుదల చేసింది. ఇది 4టిబి స్టోరేజ్ వరకు అప్షన్‌తో, వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫర్ వేగాన్ని కలిగి ఉంటుందని తెలిపింది. 1టిబి వేరియంట్ ధరను రూ.12,799కి, 4టిబి వేరియంట్‌ను రూ.33,599గా నిర్ణయించింది. 5ఏళ్ల పరిమిత వారంటీతో లభిస్తుందని పేర్కొంది.