
ప్రజాశక్తి -నక్కపల్లి:హెటిరో మందుల కంపెనీ కొత్తగా వేస్తున్న పైపులైన్‌కు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని మత్స్యకార నాయకులు స్పష్టం చేశారు. పైప్ లైన్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు తలపెట్టిన శాంతియుత మహా ధర్నా 499వ రోజుకు చేరింది. శనివారం శిబిరం వద్ద మత్స్యకారులు పైప్‌లైన్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులు మాట్లాడుతూ, శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేటి వరకు సమస్య పరిష్కారానికి మార్గం చూపకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పైప్ లైన్‌కు ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మత్స్యకారులు గోసల స్వామి, గుర్రన్న, బాబుజి, నూకరాజు, తాతాజీ, అప్పలరాజు, జోగిరాజు, రాజు, వీరన్న, దార్రాజు, కోటి, శివ, జాను, కాశీరావు, నల్ల వీర్రా, కాశీరావు, శ్రీను, తాతాజీ, అప్పలరాజు పాల్గొన్నారు .