ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 48వ వార్డు పరిధి బాపూజీనగర్, బర్మాక్యాంప్, శ్రీనివాసనగర్ ప్రాంతంలో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు, వార్డు ఇన్‌ఛార్జి నీలి రవితో కలిసి పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరించారు. ప్రజల సమస్యలనడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కెకె.రాజు మాట్లాడుతూ, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమన్నారు. మౌలిక వసతులు అభివృద్ధి చేసి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా పనిచేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాత కార్పొరేషన్ చైర్మన్ పిల్లి సుజాత, డైరెక్టర్లు రాయుడు శ్రీను, దిడ్డి రమేష్, సమ్మెట్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.










