4,834 మందికి వాహనమిత్ర:ఆర్‌టివో
4,834 మందికి వాహనమిత్ర:ఆర్‌టివో
ప్రజాశక్తి - గూడూరు రూరల్ :రాష్ట్రవ్యాప్తంగా సొంత వాహనం కలిగిన ఆటో డ్రైవర్ లకు క్యాబ్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం 5 వ విడత వాహన మిత్ర నగదును జమ చేసింది. తిరుపతి పట్టణంలో జిల్లా స్థాయిలో వాహన మిత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి రోజా ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు నమూనా చెక్కు ను అందచేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఆర్టీవో ఆదినారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఆర్టీవో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాహన మిత్ర పధకం కింద గూడూరు లో 4, 834 మంది కి వాహన మిత్ర నగదు జమ కానుంది అని తెలిపారు.










