Oct 18,2023 15:35

పాకిస్తాన్‌ : రోజురోజుకూ పాకిస్తాన్‌ ఆర్దిక పరిస్థితి దిగజారిపోతోందని చెప్పడానికి ఇది నిదర్శనం. ఆయిల్‌ కొరతతో 48 విమానాలను పాక్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ లైన్స్‌ నిలిపేసింది. వీటిలో 13 డొమెస్టిక్‌ విమానాలను, 11 ఇంటర్నేషనల్‌ విమానాలను అయితే పూర్తిగా రద్దు చేసింది. అప్పులు చెల్లించని కారణంగా పాక్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ లైన్స్‌ కు  పిఎస్ఓ  (పాకిస్తాన్‌ స్టేట్‌ ఆయిల్‌) ఇంధన సరఫరా రద్దు చేయడంతో ఆయిల్‌ కొరత ఏర్పడింది.