ఆందోళన చేస్తున్న మత్స్యకారులు
ప్రజాశక్తి -నక్కపల్లి :హెటిరో కంపెనీ కొత్తగా వేస్తున్న పైప్ లైన్ అనుమతులు రద్దు చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. పైప్‌లైన్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు తలపెట్టిన శాంతియుత మహా ధర్నా 462వ రోజుకు చేరింది. గురువారం శిబిరం వద్ద మత్స్యకారులు పైప్ లైన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కంపెనీ కాలుష్య వ్యర్ధ జలాలను సముద్రంలోకి వదలడంతో మత్స్య సంపద నశించి పోవడంతో తామంతా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. 462 రోజుల నుండి తామంతా పైప్ లైన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తుంటే, అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు వాసిపిల్లి నూకరాజు, గోసల స్వామి, పీక్కి రమణ, కోడ కాశీ, మైలపల్లి ధార్రాజు, కారే కోదండరావు పాల్గొన్నారు.










