Sep 09,2023 23:44

గుంటూరులో జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌ను పరిశీలిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి

ప్రజాశక్తి-గుంటూరు లీగల్‌ : జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ వైవిఎస్‌బిజి పార్థసారధి ఆధ్వర్యంలో శనివారం జిల్లాలోని అన్ని కోర్టులలో 'జాతీయ లోక్‌ అదాలత్‌' నిర్వహించారు. జిల్లా వ్యాపంగా వివిధ న్యాయస్థానములలలో పెండింగ్‌లో ఉన్న రాజీపడదగిన కేసులు పరిష్కారించారు. వీటిల్లో సివిల్‌ కేసులు 441, క్రిమినల్‌ కేసులు 3744, ప్రీలిటిగేషన్‌ కేసులు 243 మొత్తం 4428 కేసులు పరిష్కరించారు. జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహణకు సహకరించిన న్యాయాధికారులకు, న్యాయవాదులకు, పోలీసు, ప్రభుత్వ సిబ్బందికి, కక్షిదారులకు, న్యాయస్థాన సిబ్బందికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.చంద్రమౌళీశ్వరి ధన్యవాదాలు తెలిపారు.