ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 43వ వార్డు పరిధి 80 అడుగుల రోడ్డు, శ్రీనివాసనగర్, నందగిరినగర్, వెంకటేశ్వరకాలనీలో కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మిశ, వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ పర్యటించారు. స్థానిక సమస్యలపై ప్రజలతో మాట్లాడారు. అనంతరం కమిషనర్ లకీëశ మాట్లాడుతూ, నగరంలో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించబడిందని, ఎవరూ వాడకూడదని సూచించారు. కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ మాట్లాడుతూ, తడి, పొడి, ప్రమాదకర చెత్తను వేరు చేసి పారిశుధ్య వాహనానికి అందజేయాలని కోరారు. మలేరియా, డెంగీ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 43వ వార్డులోని పలు సమస్యలను కమిషనర్ లక్ష్మీశ దృష్టికి ఉషశ్రీ తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మల్లయ్యనాయుడు, జివిఎంసి, సచివాలయ సిబ్బంది, వైసిపి కార్యకర్తలు తిరుపతిరావు, నరసయ్య, రంజాన్ వల్లి, సన్యాసినాయుడు, లక్ష్మణ్, పెంటకోట వీరబాబు, ఖాదర్ పాల్గొన్నారు.










