ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 43వ వార్డు పరిధి జగన్నాధపురం, శ్రీనివాసనగర్, దాడి రామూర్తి కల్యాణ మండపం ప్రాంతంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు, వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజల సమస్యలనడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కెకె.రాజు మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కృషిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 42వ వార్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతిశ్రీనివాసరావు, 45వ వార్డు అధ్యక్షులు పైడి రమణ, మాజీ కార్పొరేటర్ బులుసు జగదీష్, 43వ వార్డు నాయకులు జక్కంపూడి సత్యనారాయణ, బైర వెంకట్, పారుపల్లి రవి, ఎన్.కుమార్, ఖాదర్, సన్యాసరావు, చంద్రకళ, ప్రశాంత్, భాను మూర్తి, యశోధ, సీనియర్ నాయకులు బోగవల్లి గోవింద్, షేఖ్ బాబ్జి, కె.చిన్నా, సమ్మెట్ల వెంకటేష్ పాల్గొన్నారు.










