ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 43వ వార్డు పరిధి అక్కయ్యపాలెం పోస్టాఫీసు వీధి ప్రాంతంలో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు, వార్డు కార్పొరేటర్ పెడిశెట్టి ఉషశ్రీతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజల సమస్యలనడిగి తెలుసుకున్నారు.
ముందుగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కెకె.రాజు మాట్లాడుతూ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ అల్లు శంకరరావు, కార్పొరేటర్లు సాడి పద్మారెడ్డి, ఆళ్ల లీలావతిశ్రీనివాస్, కంటిపాము కామేశ్వరి, వావిలపల్లి ప్రసాద్, చల్లా రజినిఈశ్వరరావు, కెవిఎన్.శశికళ, 48వ వార్డు ఇన్‌ఛార్జి నీలి రవి, డైరెక్టర్లు నూకరాజు, ప్రసాద్, కాయిత వెంకటలక్ష్మీరత్నాకర్, ఎయిర్ పోర్టు అడ్వయిజర్ కమిటీ మెంబర్ అంబటి శైలేష్ తదితరులు పాల్గొన్నారు.










