Jul 03,2023 00:58

ఎంఇఒకు నియామక పత్రం ఇస్తున్న ఆర్‌జెడి

ప్రజాశక్తి-గుంటూరు : పాఠశాల విద్య గుంటూరు ఆర్‌జెడి పరిధిలో ఎంఇఒ-1 ఖాళీలు భర్తీకి ఆదివారం ఆర్‌జెడి వి.ఎస్‌.సుబ్బారావు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మొత్తం 89 ఖాళీలకుగాను 43 ఖాళీలను భర్తీ చేశారు. గుంటూరు, పల్నాడు జిల్లాకు సంబంధించి క్రోసూరు జెడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎం జి.ఏసురత్నం మేడికొండూరు ఎంఇఒగా నియమితులయ్యారు. గుంటూరు తూర్పు మండలానికి ప్రకాశం జిల్లా, జెపి చెరువు జెడ్పీహైస్కూల్‌ హెచ్‌ఎం వీసం వెంకటేశ్వరరావు, తాడేపల్లి ఎంఇఒగా బాపట్ల ప్రభుత్వ హైస్కూల్‌ హెచ్‌ఎం గరిక శాంతకుమారి, కొల్లిపరకు ప్రకాశం జిల్లా పామూరు గవర్నమెంట్‌ హైస్కూల్‌ హెచ్‌ఎం జి.సాల్మన్‌రాజు, చేబ్రోలుకు సంతమాగులూరు గవర్నమెంట్‌ హైస్కూల్‌ హెచ్‌ఎం ఎ.వెంకట హనుమంతప్రసాద్‌, నర్సరావుపేటకు గురజాల గవర్నమెంట్‌ హైస్కూల్‌ హెచ్‌ఎం వి.ఏసుబాబు, ఫిరంగిపురం ఎంఇఒగా ప్రకాశం జిల్లా మైనంపూడి గవర్నమెంట్‌ హైస్కూల్‌ హెచ్‌ఎం షేక్‌.మహబూబ్‌ సుభాని, మంగళగిరికి దర్శి గర్నమెంట్‌ హైస్కూల్‌ హెచ్‌ఎం జి.సత్యనారాయణ, వట్టిచెరుకూరుకు బోపాలెం డైట్‌ అధ్యాపకులు జి.సత్యనారాయణమూర్తి, అమరావతికి ప్రకాశం జిల్లా కొమరోలు గవర్నమెంట్‌ హైస్కూల్‌ హెచ్‌ఎం మేడా శ్రీనివాసరావు, యడ్లపాడుకు వేమూరు గవర్నమెంట్‌ హైస్కూల్‌ హెచ్‌ఎం యం.వెంకటనాగరత్నం నియమితులయ్యారు. కౌన్సెలింగ్‌లో తిరుమలేశ్‌, ఉర్దూ డిఐ ఖాసిం పాల్గొన్నారు.