ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 43, 55 వార్డుల పరిధి అబీద్‌నగర్-2, రెడ్డి తాటిచెట్లపాలెం, రైల్వే న్యూకాలనీ, వెంకటేశ్వరకాలనీ ప్రాంతాల్లో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు, 55వ వార్డు కార్పొరేటర్ కెవిఎన్.శశికళ, 43వ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజల సమస్యలనడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కెకె.రాజు మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, వార్డు అధ్యక్షులు కెపి.రత్నాకర్, దుప్పలపూడి శ్రీనివాసరావు, రాయుడు శ్రీనివాసరావు, కాయిత వెంకటలక్ష్మి, అమర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










