Sep 11,2023 21:35

పత్రాలు అందజేస్తున్న కలెక్టర్‌

పత్రాలు అందజేస్తున్న కలెక్టర్‌
42 మందికి నియామకపత్రాలు అందజేత
ప్రజాశక్తి-నెల్లూరు:ఏపిపిఎస్‌సి నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 43 మంది జూనియర్‌ అసిస్టెంట్‌ కం కంప్యూటర్‌ అసిస్టెంట్‌ లకు కలెక్టర్‌ ఎం. హరి నారాయణన్‌ సోమవారం నియామక పత్రాలు అందజేశారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్‌ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను అభినందించారు. వీరికి జిల్లాలోని పలు రెవెన్యూ కార్యాలయాల్లో పోస్టింగ్‌ ఆర్డర్లు ఇచ్చారు.
6 మాట్లాడుతున్న కలెక్టర్‌
వారానికి రెండు మండల కేంద్రాల్లో 'జగనన్నకు చెబుదాం'
ప్రజాశక్తి-నెల్లూరు:ఇక నుండి వారానికి రెండు మండల కేంద్రాల్లో జగనన్నకు చెబుదాం కార్యక్రమం( స్పందన)నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఎం .హరి నారాయణన్‌ తెలిపారు. బుధవారం ,శుక్రవారం మండల కేంద్రాల్లో జరిగే జగనన్నకు చెబుదాం కార్య క్రమాన్ని జిల్లా కలెక్టర్‌ నిర్వహిస్తారని, జిల్లా అధికారులు, సంబంధిత మండల అధికారులు హాజరు కావాలని తెలిపారు. మండల కేంద్రంలో జరిగే జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి ఎంపీడీవో, తహశీల్దారు సంయుక్తంగాను, మున్సిపాలిటీలలో మున్సిపల్‌ కమిషనర్లు ఏర్పాట్లు చేయాలన్నారు.
మండల కేంద్రాల్లో జగనన్నకు చెబుదాం జరిగే తేదీ, సమయాన్ని మండల పరిధిలోని గ్రామాల్లో విస్తత ప్రచారం చేయాలని కలెక్టర్‌ తెలిపారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ ఎంపీడీవోలకు, తాసిల్దార్లకు మున్సిపల్‌ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఈనెల 13న దగదర్తి లో జగనన్న కు చెబుదాం
మొదటగా ఈ నెల 13వ తేదీన దగదర్తి మండల పరిషత్‌ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం జరుగుతుందని,జిల్లా కలెక్టర్‌ ,జిల్లా అధికారులు, మండల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని, ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలు కలెక్టర్‌ కు అందజేసి పరిష్కరించుకోవాలని కలెక్టర్‌ తెలిపారు.అలాగే ఈనెల 15వ తేదీన రాపూరు, 20వ తేదీన ఇందుకూరుపేట, 22వ తేదీ చేజర్ల, 27వ తేదీ పొదలకూరు, 29వ తేదీ కావలి లో జగనన్నకి చెబుదాం కార్యక్రమం మండల పరిషత్‌ కార్యాలయాలలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో జరుగుతుందని ఆయన తెలిపారు.