Aug 22,2022 23:01

రక్తదానంలో పాల్గొన్న యువకులు

ప్రజాశక్తి-ఆనందపురం : మండలంలోని దుక్కవానిపాలెం గ్రామంలో తమ్మిన చిన్నమ్మలు వర్థంతి సందర్భంగా గ్రామంలోని యువకులు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒఎస్‌జి ఫౌండేషన్‌, ఎఎస్‌ఆర్‌ఆర్‌ ఫౌండేషన్‌ సహకారంతో గాయత్రి విద్యా పరిషత్‌ హాస్పటల్‌, మెడికవర్‌ ఆసుపత్రి ఆధ్వర్యాన ఉచిత వైద్య శిబిరం, రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఉన్న యువత, పెద్దలు కలిసి 42 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ శిబిరంలో సేకరించిన రక్తాన్ని తల సేమియా పిల్లలకు, రక్త హీనతతో బాధపడుతున్న చిన్నారులకు అందిస్తామని ఒఎస్‌జి ఫౌండేషన్‌ అధినేత దాలయి శివ పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులకు, రోడ్డు ప్రమాదానికి గురైన వారికి ఈ రక్త అందేలా చేస్తామన్నారు. అనంతరం మెడికవర్‌ హాస్పిటల్‌ బృందం గ్రామంలో ఉన్న వృద్దులకు బీపీ, సుగర్‌, ఈసీజీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఒఎస్‌జి ఫౌండేషన్‌ బృందం, ఎఎస్‌ఆర్‌ఆర్‌ బృందం, గ్రామస్తులు పాల్గొన్నారు.