Sep 21,2023 00:54

గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న ప్రతినిధులు

ప్రజాశక్తి -కొత్తకోట:ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో 41 ఏ నోటీసును రద్దు చేయాలని దళిత సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. బుధవారం రావికమతం మండలం కొత్తకోట గ్రామంలో స్థానిక అంబేద్కర్‌ విగ్రహం వద్ద అంబేద్కర్‌ సేవా సంఘం సభ్యలతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా దళిత సేవా పరి రక్షణ సంఘం జిల్లా అధ్యక్షులు యాదగిరి దాసు, డీకేఎస్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు, మాజీ జడ్పిటిసి చిట్ల చలపతి, నర్సీపట్నం డివిజన్‌ దళిత నాయకులు మార్తి అప్పల రాజు తదితరులు మాట్లాడుతూ, ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అధికారులు తీరు అక్షేపనియమన్నారు. చట్టాలను నీరు గార్చే విధంగా వీరంతా వ్యవరిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 23 నర్సీపట్నంలో జరిగే జిల్లా దళిత సంఘాల ఐక్య సమావేశం జయప్రదం చేయాలని కోరారు. అనంతరం గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అంబేద్కర్‌ సంఘం సభ్యలు బి. బుల్లిబాబు, పూడి అప్పారావు, యూత్‌ సభ్యులు ఎన్‌, శివ, జి.మోసే తదితరులు పాల్గొన్నారు.