Feb 23,2023 23:45

పట్టుబడిన నాటుసారాను గొయ్యి తీసి అందులో వేస్తున్న పోలీసులు

ప్రజాశక్తి-అడ్డతీగల
అడ్డతీగల పోలీస్‌ సర్కిల్‌ పరిధిలో దాడులు నిర్వహించగా పట్టుబడిన 416 లీటర్ల నాటు సారాను రంపచోడవరం ఎఎస్‌పి అదిరాజ్‌ సింగ్‌ రాణా సమక్షంలో అడ్డతీగల సిఐ వై.రాంబాబు ఆధ్వర్యంలో గురువారం భూమిలో గొయ్యి తీసి అందులో వేసి ధ్వంసం చేసినట్లు స్థానిక ఎస్సై అప్పలరాజు తెలిపారు. అడ్డతీగల, వై.రామవరం, గంగవరం, దుచ్చెర్తి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో కొంతకాలంగా జరిపిన దాడుల్లో ఈ నాటుసారా పట్టుబడినట్లు ఆయన పేర్కొన్నారు. అడ్డతీగల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిపిన దాడుల్లో 270 లీటర్లు నాటు సారా, గంగవరం స్టేషన్‌ పరిధిలో 100 లీటర్లు, వై.రామవరం స్టేషన్‌ పరిధిలో 28 లీటర్లు, దుచ్చెర్తి స్టేషన్‌ పరిధిలో 18 లీటర్ల సారా పట్టు పడినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడ్డతీగల వీఆర్వో రాదయ్య, రెవెన్యూ సిబ్బంది, గంగవరం ఎస్‌ఐ చిన్నబాబు వై.రామవరం ఎస్సై సంతోష్‌ కుమార్‌, దుచ్చెర్తి ఎస్సై లతాశ్రీ, స్థానిక పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.