Aug 16,2022 00:21

జైలు నుంచి విడుదలవుతున్న ఖైదీలు

ప్రజాశక్తి - ఆరిలోవ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం విశాఖ కేంద్రకారాగారం నుంచి 41 మంది ఖైదీలను విడుదలచేశారు. వీరిలో 35 మంది జీవిత ఖైదీలు కాగా, ఏడుగురు శిక్ష ఖైదీలు ఉన్నారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. విశాఖ కేంద్రకారాగారం నుంచి క్షమాభిక్షపై 42 మంది ఖైదీలు విడుదలయ్యేందుకు అర్హులయ్యారు. వీరిలో సోమవారం 41 మంది విడుదలయ్యారు. ఒక మహిళ తాను కట్టాల్సిన జరిమాను కట్టలేక పోవడంతో మరో ఆరు నెలలు అదనంగా శిక్షాకాలం పూర్తి చేయాల్సి ఉంది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ హరిహరనాధశర్మ, జైలు పర్యవేక్షణాధికారి ఎస్‌.రాహుల్‌ సమక్షంలో సోమవారం వారిని విడుదల చేశారు. ఈ సందర్భంగా హరి హరనాధ శర్మ మాట్లాడుతూ, సుధీర్ఘ కాలం పాటు జైల్లో గడిపిన మీరు పరివర్తన చెందిన వ్యక్తులుగా సమాజంలో ఒక మంచి పౌరులుగా మెలగాలని సూచించారు.