ఆందోళన చేపడుతున్న మత్స్యకారులు
ప్రజాశక్తి -నక్కపల్లి:హెటిరో పైప్ లైన్ కు వ్యతిరేకంగా మత్స్యకారులు తలపెట్టిన శాంతియుత మహా ధర్నా 400వ రోజుకు చేరింది. గురువారం శిబిరం వద్ద మత్స్యకారులు పైప్ లైన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 400 రోజుల నుండి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ నేటి వరకు సమస్యకు పరిష్కారం చూపకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పైప్ లైన్‌కు అనుమతులు ఇవ్వబోమని స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. .ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు గోసల స్వామి పాల్గొన్నారు.










