
కరెంటు బిల్లు
ప్రజాశక్తి - మంగళగిరి : ప్రజలపై ప్రభుత్వం మోపుతున్న విద్యుత్ భారాల తీవ్రతకు నిదర్శనంగా పట్టణంలోని షరాఫ్ బజార్లో ఉండే జె.చలపతిరావుకు వచ్చిన కరెండు బిల్లు నిలుస్తోంది. గత నెలలో వీరి కుటుంబం వేరే ఊరు వెళ్లిన కారణంగా నాలుగు యూనిట్ల విద్యుత్‌నే వాడుకున్నారు. అయితే బిల్లు మాత్రం రూ.383 వచ్చింది. ఇందులో టెంపరరీ ఛార్జీ రూ.7.60 కాగా ఎఫ్‌పిపిసిఎ ఛార్జి రూ.231, ట్రూ ఆఫ్ చార్జీ రూ.97, ఇతర ఛార్జీలు కలిపి రూ.383 బిల్లు వచ్చింది.