May 01,2023 01:36
మాట్లాడుతున్న మజుందార్‌

ప్రజాశక్తి-బాపట్ల: విశాఖ ఉక్కు పోరాటానికి మద్దతుగా ఈ నెల 3న నిర్వహించే రాస్తారోకోలను జయప్రదం చేయాలని సిఐటియు, ఏఐటీయూసీ సంఘాలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ఆదివారం బాపట్ల సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిఐటియు, ఎఐటి యుసి నాయకులు మాట్లాడారు. ఈ సందర్భం గా సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్‌ మజుందా ర్‌ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో గత 50 యేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిపి 27 మంది బలిదానంతో శాసనసభ్యులు, పార్లమెంట్‌ సభ్యుల రాజీనామాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నేటి కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా మన్నారు. లక్షలాది మంది కార్మికులు నమ్ముకు న్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు జేఏసీగా గత రెండేళ్ళుగా ఉద్యమిస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాయన్నారు. విశాఖ ఉక్కు సాధనకు ఏప్రిల్‌ 19న విజయవాడలో జరిగిన అన్ని ట్రేడ్‌ యూనియన్‌, ప్రజా సంఘా లు, వామపక్షాలు హాజరై కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను నూటికి నూరు శాతం సామర్థ్యంతో ప్రభుత్వ రంగంలోనే నడపాలని, మే 3న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య రాస్తారోకో నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శామ్యూల్‌, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జెల్ది భాగ్య శ్రీధర్‌, బాపట్ల పట్టణ సిఐటియు కార్యదర్శి జె శ్యామ్యూల్‌, కుమార్‌ పాల్గొన్నారు.