Aug 28,2023 00:27

గుంటూరు జిల్లా ప్రతినిధి: బాల్యానికి పసిడి బాటలు చూపే నిత్య విద్యార్ధులు నిజమైన గురువులని శాసనమండలి సభ్యులు, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి వ్యాఖ్యా నించారు. ఉత్తమ సమాజ నిర్మాణానికి ఉపా ధ్యాయులే కీలకమని ఆయన కితాబిచ్చారు. టీచర్స్‌ డే సందర్భంగా జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులను గుర్తించి, వారిని గౌరవించాలని సమైఖ్య ప్క్రెవేట్‌ లెక్చరర్స్‌, టీచర్స్‌ ఆర్గనైజేషన ్‌(ఎస్‌పి ఎల్‌టిఓ) సంకల్పించింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కేయస్‌ లక్ష్మణరావు నేతత్వంలో ఒక జ్యూరీ కమిటీని ఏర్పాటు చేసుకుని, నిష్పక్షపాతంగా ఉత్తమ గురువులను ఎంపిక చేసి, సెప్టెంబర్‌ 3వ తేదీన గుంటూరు వేదికగా వారిని ఘనంగా సత్కరించాలని నిర్ణయించింది. ఈ నేపధ్యంలో ఆదివారం బందావన్‌గార్డెన్స్‌లోని క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ బత్తుల దేవానంద్‌ ఆధ్వర్యంలో ఆర్గనైజేషన్‌ ప్రతినిధులు ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డిని కలిసి రాష్ట్ర స్థాయిలో జరగనున్న గురువుల సన్మాన మహౌత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరారు. ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డిని కలిసిన వారిలో ఆర్గనైజేషన్‌ వ్యవస్థాపక అధ్య క్షుడు డాక్టర్‌ పి.నాగయ్య, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం.సురేష్‌, వర్కింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డి.రమేష్‌ తదితరులు ఉన్నారు.