Oct 01,2023 00:51

పల్నాడు జిల్లా: అక్టోబర్‌ 3న జరిగే బ్లాక్‌ డే కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాల్లో జయప్రదం చేయాలని ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు నిచ్చింది. మండల కేం ద్రం నకరికల్లులోని ప్రజాసంఘాల కార్యాలయంలో శని వారం రైతు,కార్మిక, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సం ఘాల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమా వేశానికి రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు అధ్య క్షత వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం జరిగే సందర్భంలో, ఉత్తరప్రదేశ్‌ లోని లఖింపూర్‌ ఖేరి లో నిరసన తెలియ జేస్తున్న రైతులపై, జీపును నడిపించి హత్య చేసిన ఘటన అక్టోబర్‌ 3 ను బ్లాక్‌ డే జరిపి నిరసన తెలియ జేయాల్సిందిగా పిలుపు నిచ్చారన్నారు. ఈ ఏడాది ఆగస్టు 24వ తేదీన జరిగిన జాతీయ సదస్సులో పాల్గొన్న సం యుక్త కిసాన్‌ మోర్చా, 11 కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్ల ఐక్యవేదిక పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. రైతు హంతకులను వెనకేసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆగడాలను ఎండగడుతూ, రైతు, కార్మిక వ్యతిరేక విధా నాలను నిరసిస్తూ జరిగే నిరసన కార్యక్రమాల్లో అన్ని మండల కేంద్రాల్లో రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షడు గుంటుపల్లి బాలకృష్ణ, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై.రాధాకృష్ణ, కామినేని రామారావు, సిఐ టియు జిల్లా కార్యదర్శి ఆంజ నేయ నాయక్‌, కోశాధికారి శివకుమారి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అనుముల లక్ష్మీశ్వర్‌రెడ్డి తది తరులు పాల్గొన్నారు.