Jun 01,2023 17:34

ప్రజాశక్తి-రాజవొమ్మంగి(అల్లూరిజిల్లా) : మండలంలోని జడ్డంగి, రాజవొమ్మంగి పోలీస్‌ స్టేషన్లో 35 కేసుల్లో పట్టుబడిన 398 లీటర్ల నాటుసారాను ఏఎస్పీ జగదీష్‌ అదహళ్లి ఆధ్వర్యంలో పోలీసులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా రాజవొమ్మంగి సీఐ షేక్‌ బాజిలాల్‌ మాట్లాడుతూ.. నాటుసారా విక్రయించడం తయారు చేయడం చట్టరీత్య నేరమన్నారు. నాటుసారాకు ప్రత్యామ్నాయంగా వేరే వ్యాపారాలు చేసుకోవాలని ఆయన సూచించారు, నాటుసారా వల్ల అనేక నిరుపేద కుటుంబాలు వీధిన పడుతున్నాయని నాటుసారా సేవించి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈ విషయాన్ని అక్రమ నాటు సారా వ్యాపారులు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజవొమ్మంగి, జడ్డంగి ఎస్‌ఐలు గోపి నరేంద్ర ప్రసాద్‌, షరీఫ్‌ చెరుకుపాలెం రాజవొమ్మంగి విఆర్వోలు నాగేశ్వరరావు భారతి పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.