Oct 10,2022 23:42

పట్టుబడిన గంజాయి, నిందితులతో పోలీసులు

ప్రజాశక్తి-మారేడుమిల్లి
మారేడుమిల్లి మీదగా ఉత్తరప్రదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని మారేడుమిల్లి పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఎస్సై రాము కథంన ప్రకారం...ఉత్తరప్రదేశకు చెందిన లహారి రామ్‌ యాదవ్‌, అభమ్‌ రాజ్‌ యాదవ్‌ ఇద్దరు వ్యక్తులు టెన్‌ టైర్‌ లారీలో గంజాయిని ఉత్తరప్రదేశకు తరలిస్తుండగా స్థానిక గుజ్జు మామిడివలస జంక్షన్‌ వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 375 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఆరెస్ట్‌ చేసి, లారీని సీజ్‌ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు.