ప్రజాశక్తి-నక్కపల్లి :హెటిరో పైప్ లైన్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు తలపెట్టిన శాంతియుత మహా ధర్నా గురువారం నాటికి 372వ రోజుకు చేరింది. హెటిరో వ్యర్ధ రసాయన జలాలు సముద్రంలోకి వదలడంతో మత్స్య సంపద నశించి పోవడంతో తామంతా ఉపాధి కోల్పోయి రోడ్డును పడ్డామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ కాలుష్యం కారణంగా అనేకమంది రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వెలబుచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంపెనీ కొత్తగా వేస్తున్న పైప్ లైన్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మత్స్యకార జెఎసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిపిల్లి నూకరాజు, చేపల సోమేష్, మైలపల్లి జాను, మైలపల్లి బాపూజీ, మైలపల్లి శివాజీ, కోడా కాశీరావు, పిక్కి రమణ, కొత్వాల కాశి, చొడిపల్లి రాజు, కారే కోదండరావు, కారే సతీష్, బొంది తాతారావు, పిక్కి కిరణ్ పాల్గొన్నారు.










