Dec 04,2022 22:34

ఆందోళన చేస్తున్న మత్స్యకారులు

ప్రజాశక్తి-నక్కపల్లి:హెటిరో పైప్‌ లైన్‌కు వ్యతిరేకంగా మత్స్యకార జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత మహా ధర్నా ఆదివారం నాటికి 369 వ రోజుకు చేరింది. శిబిరం వద్ద మత్స్యకారులు పైప్‌లైన్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. మత్స్యకారుల జీవన విధానానికి నష్టం కలిగించే పైప్‌ లైన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వకూడదని మత్స్యకారులు డిమాండ్‌ చేశారు. సమస్య శాశ్వతంగా పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం గ్రామ కార్యదర్శి మైలపల్లి మహేష్‌బాబు, మత్స్యకారులు గోసల సోమేశ్వరరావు, మైలపల్లి బాపూజీ, మైలపల్లి శివాజీ, కొత్వాల కాశి, కొడ కాశి, కారే కోదండరావు చొడిపల్లి రాజు, దేముడు, వీర్రాజు, చిరంజీవి పాల్గొన్నారు.